మానవత సీనియర్ సభ్యులచే కరోనా కరపత్రం ఆవిష్కరణ
యుకె స్ట్రెయిన్ కరోనా వైరస్ పై మానవత పెనుగొండ మండల శాఖ రూపొందించిన కరపత్రాన్ని పిట్టలవేమవరం గ్రామానికి చెందిన మానవత సీనియర్ (సిటిజన్స్) సభ్యుల చేతులమీదుగా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించామని మానవత పెనుగొండ మండలశాఖ ఛైర్మెన్ టి.వి.కె రంగారెడ్డి తెలియచేసారు. యుకె స్ట్రెయిన్ కరోనా కరపత్రం ఆవిష్కరణ సమావేశంలో రంగారెడ్డి మాట్లాడుతూ పిట్టలవేమవరం గ్రామస్థులు 50 మంది పెనుగొండ మండలశాఖలో గత 6 సంవత్సరాలుగా సభ్యులుగా కొనసాగుతున్నారని, కరోనా కరపత్రాన్ని వారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయించాలనే సంకల్పంతో పెనుగొండ మండల శాఖ పిట్టల వేమవరం గ్రామంలో ఈ కార్యక్రమం ఏర్పాటుచేసిందని, 2020-21 జిల్లా డైరెక్టరీని కూడా గ్రామానికి చెందిన ‘మానవత’ సభ్యులు ఆవిష్కరించారని టి.వి.కె. రంగారెడ్డి పేర్కొన్నారు. 2020-21 జిల్లా డైరెక్టరీని ఎం. భద్రాద్రిరామిరెడ్డి, పడాల కృష్ణారెడ్డి, నల్లిమిల్లి వీర్రెడ్డి, నల్లిమిల్లి వెంకటరెడ్డి, పడాల రాంపండు ఆవిష్కరించగా, కరోనా కరపత్రాన్ని ఎం. చినవెంకట రెడ్డి, పి. రామస్వామిరెడ్డి, కర్రి శ్రీనివాసరెడ్డి, ఎన్. కృష్ణారెడ్డి, పడాల చినబాబులు ఆవిష్కరించారని పెనుగొండ మండలశాఖ కోశాధికారి బచ్చు లక్ష్మీ నరసింహమూర్తి తెలిపారు.
కార్యక్రమంలో మానవత డైరెక్టర్ బోర్డు సభ్యులు ఎం. శివరామ రెడ్డి, సలహా సంఘ సభ్యులు కె.వి. సురేష్ బాబు, కోశాధికారి బి.ఎల్.ఎన్. మూర్తి, గ్రామానికి చెందిన మానవత సభ్యులు పాల్గొన్నారు.