Preloader

West Godavari

Home|West Godavari

పశ్చిమ గోదావరి జిల్లా అధ్య క్షులు

కృష్ణా జిల్లా, కలిదిండి మండలం, సీతారామపుర అగ్రహారంలో 19-11-1952న శ్రీ రామయ్య, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. 1976లో సూర్యనాగమణి గారితో వివాహం జరిగింది. ప.గో. జిల్లా పరిషత్‌లో ఉపాధ్యాయునిగా చేరి, స్కూల్‌ అసిస్టెంట్‌గా, ప్రధానోపాధ్యాయునిగా, మండల విద్యాశాఖాధికారిగా పనిచేసి పదవీవిరమణ చేసారు. జిల్లాస్థాయిలో, రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఆనాటి రాష్ట్రపతి అబ్బుల్‌ కలాంగారి చేతులమీదుగా బంగారు పతకము, ప్రశంసాపత్రము అందుకున్నారు. ఉత్తమ మండల విద్యాశాఖాధికారిగా ప్రశంసాపత్రము పొందారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి లావణ్య, అల్లుడు పరుచూరి వీరరాఘవరావు. చిన్నమ్మాయి డాక్టర్‌ సౌజన్య, అల్లుడు డాక్టర్‌ చిట్టూరి భుజంగరావు. మనుమలు – శ్రీకర్‌, సుతీర్ట్‌, శ్రీరామ్‌.

2013లో హనుమాన్‌జంక్షన్‌ అధ్యక్షులుగా ‘మానవతఃలో ప్రవేశించి, ప.గో.జిల్లా నియంత్రణ కమిటీ డైరెక్టర్స్‌ విద్యానిధి కమిటీ కో-ఛైర్మన్‌, కెరీర్‌ గైడెన్స్‌ కమిటీ ఛైర్మన్‌గా సేవలందిస్తూ, కృష్ణా జిల్లా నుండి కేంద్ర నియంత్రణ కమిటీ డైరెక్టర్‌గా పనిచేస్తూ, ఈ సంవత్సరానికి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.

“Strong people stand up for themselves, but stronger people stand up for others.” 

west

రీజియన్ -01

జంగారెడ్డిగూడెం మండలం కొయ్యలగూడెం మండలం కామవరపుకోట మండలం చింతలపూడి మండలం

రీజియన్ -05

తాడేపల్లిగూడెం మండలం ఉంగుటూరు మండలం పెంటపాడు మండలం

రీజియన్ -02

దేవరపల్లి మండలం గోపాలపురం మండలం తాళ్లపూడి మండలం

రీజియన్ -06

గణపవరం మండలం నిడమర్రు మండలం ఉండి మండలం

రీజియన్ -03

భీమడోలు మండలం నల్లజర్ల మండలం ద్వారకాతిరుమల మండలం దెందులూరు మండలం

రీజియన్ -07

తణుకు మండలం ఉండ్రాజవరం మండలం నిడదవోలు మండలం

రీజియన్ -04

ఏలూరు మండలం పెదపాడు మండలం తడికలపూడి మండలం

రీజియన్ -08

పెనుగొండ మండలం పెనుమంట్ర మండలం ఆచంట మండలం

“మానవత ” సేవలను కృష్ణా, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు విస్తరించే క్రమంలో కృష్ణాజిల్లాలో  ఇప్పటికే 6 శాఖలను ప్రారంభించడం జరిగింది. 35,000 మంది సభ్యులతో ఈ సంవత్సరం 15 శాఖలను వర్పాటుచేయుటకు కృషి జరుగుతోంది.

నిరుపేదలకు, కష్టాలలో వున్న వారికీ ‘మానవత సంస్థ ఉన్నదనే భరోసా కల్పించే విధంగా పనిచేయడం మన ప్రధాన ఆశయంగా ఉండాలి. ఉత్తమ సమాజం అనేది “విద్య” ద్వారా మాత్రమే సఫలమవుతుందని మానవత నమ్మకం. అందుకోసం పాఠశాలలు, కళాశాలలలోని విద్యార్థులకు నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసములపై అవగాహన కల్పించి, ఉత్తమ సమాజమును నిర్మించే దిశలో కృషి చేయడం, పర్యావరణ పరిరక్షణకై మొక్కల పెంపకం, ప్లాస్టిక్‌ వాడకం తగ్గించుటపై ప్రజలలో అవగాహన పెంచడం, ప్రతి జల్లాలోనూ అన్ని గ్రామాలలో సంవత్సరానికి కనీసం ఒక వీధిలో మానవత ఆధ్వర్యంలో మొక్కలను పెంచుట ద్వారా సమాజ వికాసానికి కృషిచేద్దాం.

వ్యక్తిగతంగా కూడా మన శక్తి మేరకు ఆర్థికంగా సేవలు అందించగలిగితే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. దీని వలన మనకు ఎంతో ఆత్మ సంతృప్తి లభిస్తుంది. ఇదే దిశలో నాకు వచ్చే నెలవారీ పింఛన్‌లో అధికభాగం పేద విద్యార్థుల చదువులకు, ఆపదలో వున్నవారిని ఆదుకోవడానికి వినియోగిస్తున్నానని తెలియ జేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను.

హనుమాన్‌జంక్షన్‌లోని ఆదిత్య బదిరుల పాఠశాలకు 7 లక్షల రూపాయలతో స్థలం కొని ఇవ్వడం, కృష్ణాజిల్లా కలిదిండి మండలం మానవత శాఖకు 3.50 లక్షల రూపాయలతో నా తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం శాంతిరధాన్ని సమకూర్చడం, పామర్రు శాఖకు 60 వేల రూపాయలతో మా పిన్ని బాబాయిగార్ల పేరిట ఫ్రీజర్‌బాక్స్‌ని అందించడం, అప్పనవీడు ‘హైస్కూల్‌కు విద్యార్థుల ఫర్నిచర్‌ నిమిత్తం 1.25 లక్షల రూపాయలు అందించగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దేశ విదేశాలలో వున్న ఈ హైస్కూల్‌ విద్యార్థుల నుండి 86 లక్షల రూపాయల విరాళాలు సేకరించి, పాఠశాలకు సిమెంట్‌ రోడ్‌, ప్రహారీగోడ, భోజనశాల, కళావేదిక, బోర్‌వెల్‌ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం వంటివి నా జీవితంలో మరపురాని ఘట్టాలు. ఇదే విధంగా ‘మానవతి సభ్యులందరూ తమ శక్తి మేరకు వివిధ కార్యక్రమాలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.

శాంతి జీవనము వల్ల కలిగే లాభాలను శాంతి ర్యాలీల ద్వారా ప్రజలకు వివరించి, శాంతి జీవనము వైపు మళ్లించుట మన ప్రధాన ధ్యేయంగా పనిచేయాలి.

ఇట్లు,

మారుబోయిన కోటేశ్వరరావు
జిల్లా అధ్యక్షుడు
ఫోన్‌: 89858 62096